కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి
దమ్మపేట: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని మందరపల్లి రాష్ట్రీయ రహదారిని అనుకుని ఉన్న తోటలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరాలపై ఆదివారం అర్థరాత్రి పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో ఖమ్మం, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొంతమంది పరారయ్యారు. వీరి నుంచి భారీగా లక్షల మొత్తంలో నగదును, కార్లను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో దమ్మపేట ఎన్‌ఐ అశోక్, సీఐ సంపత్ కుమార్‌లు పాల్గొన్నారు.