కోడేరు మండల వ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 02 కోడేరు మండల పరిధిలోని మైలారం రాజాపురం మరియు అన్ని గ్రామాలలో భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సింగల్ విండో డైరెక్టర్లు, మహిళలు, పెద్ద ఎత్తున జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులు గ్రామ కార్యదర్శులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా రాజాపూర్ గ్రామంలో సర్పంచ్ దేశ గౌని లీలావతి మధు గౌడ్, గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో రాజాపూర్ గ్రామ సర్పంచ్ దేశ గౌని లీలావతి మధు గౌడ్, గ్రామ ఉపసర్పంచ్ కే బాలకిష్టయ్య గ్రామ వార్డు మెంబర్లు మహిళలు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా మైలారం గ్రామంలో గ్రామ సర్పంచ్ ఏ మశన్న ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గ్రామ యువకులు మహిళలు వార్డ్ మెంబర్లు వివిధ పార్టీల నాయకులు అందరూ పాల్గొన్నారు. కోడేరు మండల కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.