కోతు బెడద నివారణకు పళ్ల మొక్కల పెంపకం

అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెంపకం
అడవుల విస్తీరణం కోసం 30 లక్షల టేకు మొక్కల ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  కోతుల బెడద నివారించేందుకు అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటనున్నామని డీఆర్‌డీఏ పీడీ జగత్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వివిధ  రకాల పండ్ల మొక్కలను నాటి గ్రామాల్లో కోతులకు ఆవాసంగా చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. నేరేడు, సీతాఫలం, వెలగ, రేగు, మారేడు వంటి పండ్ల మొక్కలు ఉంటాయని చెప్పారు. అదే విధంగా 30 లక్షల టేకు మొక్కలను పెంచుతున్నామని అన్నారు. మార్చి నెలాఖరు నాటికి ప్లాంటింగ్‌ చేసేందుకు ఏరియాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.  హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 1.38 కోట్ల మొక్కలు పెంచుతున్నట్లు చెప్పారు. జిల్లాలోని 479 గ్రామ పంచాయతీలకు గాను ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే అటవీ శాఖ ఆధ్వర్యంలో 45 నర్సరీలు పని చేస్తున్నాయని, అటవీ నర్సరీలు ఉన్న గ్రామ పంచాయతీలు మినహాయించి మిగతా పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కొక్క నర్సరీకి జనాభా, ఇళ్ల సంఖ్య ఆధారంగా 25 వేల నుంచి లక్ష మొక్కలు పెంపకానికి లక్ష్యాలను నిర్దేశిరచినట్లు వివరించారు. అటవీ శాఖకు 40 లక్షలు, గ్రామ పంచాయితీల నుంచి 98 లక్షలు చొప్పన హరితహారం కార్యక్రమానికి మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. నిర్దేశిరచిన లక్ష్యాల్లో 25 శాతం అటవీ పండ్ల మొక్కల పెంపకాన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జాతీయ గ్రావిూణ ఉపాధి హవిూ పథకంలో భాగంగా హరితహారం, వైకుంఠధామాల నిర్మాణానికి వచ్చే ఏడాదికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రజల సౌకర్యార్థం వైకుంఠధామాల నిర్మాణాన్ని వేగవంతం చేశామని, కొత్త పంచాయితీల ఏర్పాటుకు ముందు 205 గ్రామ పంచాయతీలకు 99 వైకుంఠధామాలు మంజూరైనట్లు పేర్కొన్నారు. వీటిలో ఆరు పూర్తి కాగా మరో 26 వైకుంఠధామాల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఒక్కొక్క వైకుంఠధామానికి రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు కూడా వైకుంఠధామాలు మంజూరు చేస్తామన్నారు. ఒక్కొక్క వైకుంఠధామం నిర్మాణానికి కనీసం ఎకరం నుంచి అర ఎకరం స్థలం అందుబాటులో ఉంటే నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. వైకుంఠధామాల నిర్మాణం కోసం దాతలు కూడా కొన్ని పనుల్లో భాగస్వామ్యం అందించాలని కోరారు. గతంలో వైకుంఠధామాల నిర్మాణంలో సరైన ప్రాధాన్యత లేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అసౌకర్యాన్ని గుర్తించి నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు.