కోదండరాం, ఐకాస నేతల అరెస్టు
మహబూబ్‌నగర్: తెలంగాణలో ప్రారంభం కానున్న చంద్రబాబు పాదయాత్రను నిరసిస్తూ రాజోలి వెళ్తున్న ఐకాసనేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాజోలి వెళ్తున్న నేతలను శాంతినగర్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వారు తమను వెళ్లడానికి అనుమతించాలని రోడ్డు పై బైఠాయించారు.పాదయాత్రలో పాల్గొన డానికి అక్కడికి వచ్చిన తెదేపా నేతలు, కార్యకర్తలు వారిని అక్కడి నుంచి పింపివేయాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వీళ్లందరిని అరెస్టు చేసి, ఆలంపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపేందుకు వెళ్తున్న తమను అరెస్టు చేయడం దారుణమని కోదండరాం అన్నారు.