కోదండరామ్ తీరుపై ప్రజల్లో ఆందోళన: లోక
ఆదిలాబాద్,నవంబర్3(జనంసాక్షి): ఉద్యమనేతగా చెప్పుకునే కోదండరాం చంద్రబాబు కుట్రలకు లొంగి పోవడం దారుణమని రాష్ట్ర పాడిసమాఖ్య ఛైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. ఆయన నిర్ణయం తెలంగాణ ప్రజలకు మింగుడుపడడం లేదని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే జుట్టు చంద్రబాబుకు ఇచ్చినట్లేనని అన్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత ఒప్పందాన్పి కుదుర్చుకుని తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కూటమి కట్టడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలనే కసితో ఉన్నారని అన్నారు. మహాకూటమి ఆవిర్భావమే కాంగ్రెస్ ఓటమికి నాంది పలుకుతుందని, ఈ కూటమి టీఆర్‌ఎస్ గెలుపును సులువు చేసిందని అన్నారు. జి ల్లాలోని పలు గిరిజన తండాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రచారమే తుది దశకు వచ్చిన ఈ తరుణంలో నేటికి సీట్ల ఒప్పందానికి రాని కూటమి ఎలా గెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. గ్రామాల్లో ఓటర్ల స్పందన చేస్తుంటే ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని అనిపిస్తున్నదని, టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు సునాయసమని అన్నారు.