కోదాడ పురపాలక సంఘం అధ్వర్యంలో లో బతుకమ్మ పండుగ కు అన్ని ఏర్పాట్లు పూర్తి;మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
కోదాడ టౌన్ సెప్టెంబర్ 24 ( జనంసాక్షి )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర పండుగ గా తెలిపినటువంటి బతుకమ్మ పండుగను కోదాడ పట్టణ ప్రజలకోసం పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కోదాడ మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ మునిసిపల్ కార్యాలయంలో జరిగిన ఆర్ పి ల సమావేశంలో తెలిపారు.ఈ సందర్భగా వారు మాట్లాడుతూ పట్టణ మహిళలు అందరూ పట్టనంలోని ఉన్నత పాఠశాలలో బతుకమ్మ కోసం పూర్తిస్థాయిలో లైటింగ్ సదుపాయా
లు మంచినీటి సదుపాయం,కల్పించామన్నారు.
అలాగే నిమజ్జన ప్రాంతాల్లో మహిళలకు ఇబ్బంది కలుగకుండా మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఈ నెల 25 నుండి అక్టోబర్ 3 వరకు జరిగే ఈ బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో వీరితో పాటు మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,పార వీరయ్య,అధికారులు మరియు ఆర్ పి లు పాల్గొన్నారు.