కోరుట్ల మున్సిపల్ ఛైర్మన్‌గా గడ్డవిూది పవన్ కుమార్
ఏకగ్రీవంగా ముగిసిన ఎన్నిక
జగిత్యాల,ఫిబ్రవరి11(జనంసాక్షి): కోరుట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి టీఆర్‌ఎస్ కౌన్సిలర్ గడ్డవిూది పవన్ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం కోరుట్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉండగా.. 27 మంది కౌన్సిలర్లు టీఆర్‌ఎస్ కౌన్సిలర్ పవన్‌కుమార్‌కు మద్దతు పలికారు. దీంతో గడ్డవిూది పవన్ కుమార్ ఎన్నికను మెట్‌పల్లి సబ్‌కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన గడ్డవిూది పవన్‌కు.. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఆర్‌ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నా ఫలింలేదని అన్నారు. గతంలో జువ్వాడి నర్సింగరావుతో పాటూ ప్రస్తుతం కాంగ్రెస్ కౌన్సిలర్లుగా చెప్పుకుంటున్న వారు కూడా టీఆర్‌ఎస్‌లో చేరిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పార్టీ టికెట్‌పై గెలిచిన సభ్యుల్లో మూడొంతల మంది వ్యతిరేకిస్తే విప్ చెల్లదని ఆయన పేర్కొన్నారు. ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కోరుట్ల మున్సిపల్ అధ్యక్ష పదవిని సునాయాసంగా దక్కించుకోవడంపై టిఆర్‌ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.



