కోరo ఆయంలో ఇల్లందు అభివృద్ధి శూన్యం.. ఏ ఏం సి చైర్మన్ హార్సింగ్ నాయక్ వెల్లడి..

ఇల్లందు జులై 20 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్ ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఖండిస్తూ, పత్రికవిలేకరుల సమావేశంలో తెలియజేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్ మాట్లాడుతూ..ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్ పదవులు ఇచ్చిన కొరం కనకయ్యకు ఇల్లందు నియోజకవర్గానికి ,భద్రాద్రి జిల్లాకు ఎలాంటి అభివృద్ధి సాధించలేదని అసెంబ్లీ ఎన్నికల పిదప కోరం కనకయ్యకు రాజకీయ సన్యాసం తధ్యమని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భానోత్ హరి సింగ్ నాయక్ అన్నారు.ఇల్లందు ఎమ్మెల్యేగా కొరం కనకయ్య నియోజక వర్గాన్ని మండలానికి ఒక నాయకుడిని అమ్ముకున్నాడని ,నేడు రాజకీయ వ్యాపారి పొంగులేటి కి ఇల్లందును గుండు గుత్తగా అమ్ముకునే యత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు తీసుకురాలేని అసమర్ధుడిగా కోరం కనకయ్య చరిత్రలో నిలిచిపోయాడని 2018లో రాష్ట్ర మంతట టిఆర్ఎస్ ప్రభంజనం వీచిన ఇల్లందులో కోరం కనకయ్య చిత్తుగా ఓడిపోవడం ఆయన దివాలా కోరుతనానికి నిదర్శనం అన్నారు.అవినీతి కుటుంబంతో ఊరేగుతున్న కోరం కనకయ్య పగటి కలలు వీడి టికెట్ గతి చూసుకో అన్నారు. నీకు రానున్న ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని ఆర్టీసీ డిపో, పేద ప్రజల సంక్షేమ పథకాలను విమర్శిస్తే పుట్టగతులు ఉండవని వారు కోరం కనకయ్యను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్,పరుచూరి వెంకటేశ్వర్లు, ఘాజి, ఖమ్మంపాటి రేణుక ,మనోజ్ తివారి, నీలం రాజశేఖర్, గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.