కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కతా,నవంబర్‌5(జ‌నంసాక్షి): పశ్చిమ్‌బంగా రాజధాని కోల్‌కతా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలో చాలా రద్దీగా ఉండే పార్క్‌ స్ట్రీట్‌ ప్రాంతంలోని అప్పీజే హౌస్‌ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు దాదాపు పది అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. భవనం కిటికీల నుంచి నల్లటి పొగలు వెలువడుతున్న ఫొటోలను నెటిజన్లు సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశారు. బహుళ అంతస్తులు గల అప్పీజే హౌస్‌లోని అయిదో అంతస్తులో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకు సర్వర్‌ షార్ట్‌ సర్క్యూట్‌కు గురవ్వడం వల్ల మంటలు చెలరేగి వ్యాపించాయని సమాచారం. భవనం నుంచి అందరినీ ఖాళీ చేయించామని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పార్క్‌ స్టీట్ర్‌ ప్రాంతానికి వెళ్లే వాహనాలను కోల్‌కతా ట్రాఫిక్‌ పోలీసులు ముందుగానే ఆపేస్తున్నారు. ప్రమాదం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.