కోల్‌ గేట్‌ పై దాసరిని విచారించిన సీబీఐ

హైదరాబాద్‌, జనంసాక్షి: యావత్‌ దేశాన్ని ఓ కుదుపుతున్న బొగ్గు కుంభకోణం కేసులో సినీ దర్శక, నిర్మాత మాజీ కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావుకు బొగ్గు మసి అంటుకుంది. లక్షా 86వేల కోట్ల బొగ్గు కుంభకోణంలో దసరి పాత్రపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి ఆయనను నాలుగు రోజుల క్రితం సీబీఐ విచారించినట్లు సమాచారంఈ విషయాన్ని సీబీఐ ధ్రువీరకరించింది. దాసరితో పాటు అప్పటి కేంద్రమంత్రి సంతోష్‌ బగ్రోడియాను విచారించినట్లు తెలుస్తోంది.