కోవిడ్‌తో ప్రపంచంలో అనేక మార్పులు

 

 

వైరస్‌ మనకు ఎన్నో పాఠాలు నేర్పింది

టెక్నాలజీతే పైచేయిగా మారింది

సరికొత్త ఆవిష్కరణలో యువత ముందుండాలి

ఐఐటీ 51వ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): కొవిడ్‌ మహమ్మారి తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు చోటుచేసు కుంటున్నాయని, అందులో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సాంకేతికత పైచేయి సాధిస్తుంద్నారు. కొవిడ్‌ వైరస్‌ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని అన్నారు. దిల్లీలో జరుగుతున్న ఐఐటీ 51వ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఐఐటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచీకరణ ఎంత ప్రాముఖ్యమో కరోనా తెలియజేసిందని, అయితే అదే సమయంలో స్వావలంబన కూడా ముఖ్యమేనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ మన జీవన విధానంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఎన్నో మార్పులు చోటుచేసు కున్నాయి. వర్చువల్‌ రియాల్టీ అనేది ఇప్పుడు వాస్తవంలోకి వచ్చింది. సాంకేతికత వల్ల చివరి వ్యక్తికి కూడా

సేవలు అందుతున్నాయి. అవినీతికి ఆస్కారం తగ్గిందని మోదీ తెలిపారు. యువ వ్యాపారవేత్తలకు అవకాశాలు కల్పించేందుకు భారత్‌ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అలాంటిదేనని, దీని వల్ల యువత ఎన్నో ఆవిష్కరణలు చేపట్టొచ్చని అన్నారు. యువతకు సులభతర వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని, తద్వారా వారు తమ సృజనాత్మకత, నైపుణ్యాలతో కోట్లాది మంది భారతీయుల జీవనవిధానాన్ని సులభతరం చేయాలన్నారు. ‘బహుళజన అవసరాలపై ఆవిష్కరణలు చేయండి.. నాణ్యతపై దృష్టిపెట్టండి.. ఎన్నడూ రాజీ పడొద్దు..’ అంటూ మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విూ ఆవిష్కరణలతో భారత ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలన్నారు. బ్రాండ్‌ ఇండియాకు యువ ఆవిష్కర్తలే బ్రాండ్‌ అంబాసిడర్లని ప్రశంసించారు. సీవీ రామన్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. రామన్‌ సాధించి విజయాలు అందరికీ ప్రేరణ ఇస్తాయన్నారు. ముఖ్యంగా యువ శాస్త్రవేత్తలకు ఆయన ఎంతో చేశారన్నారు. ప్రస్తుతం కోవిడ్‌ మహమ్మారి వేళ.. టెక్నాలజీ కీలక పాత్ర పోషించిందని, వర్చువల్‌ రియాల్టీ ఇప్పుడు వర్కింగ్‌ రియాల్టీగా మారిందని ప్రధాని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను యువతకు అందించేందుకు దేశం కట్టుబడి ఉందని, యువత తమ ఆవిష్కరణల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో మార్పును తీసుకురాగలరన్నారు. కోవిడ్‌ మహమ్మారి ఎంతో నేర్పిందని, గ్లోబలైజేషన్‌ చాలా కీలకమైందని, అలాగే స్వయం సమృద్ధి కూడా చాలా ముఖ్యమైందన్నారు. యువత తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ఆత్మనిర్బర్‌ భారత్‌ ఓ వేదికగా నిలుస్తుందన్నారు.