కోస్తాంధ్రాలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు
హైదరాబాద్ : రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్‌లను అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశించింది. ముఖ్యంగా శ్రీకాకులం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురువనున్నట్లు విపత్తు నిర్వాహణశాఖ తెలిపింది. కలెక్టర్లు అన్ని ముందు జాగ్రత్త చర్యలతో సిద్దంగా ఉండి పరిస్థితి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలని విపత్తు నిర్వాహణ శాఖ కమిషనర్ రాధ ఆధేశించారు. తెలంగాణ, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆయన వెళ్లడించారు.