కోహ్లీ గొడవపై అశ్విన్, గేల్ సహా ఎవరైనా సవాల్ ఇష్టం

పెర్త్: విరాట్ కోహ్లీ జర్నలిస్టును తిట్టిన విషయమై భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందించాడు. ఈ నెల 3వ తేదీన కోహ్లీ ఓ జర్నలిస్టును తిట్టడం, ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. దీనిపై సదరు జర్నలిస్టు ఐసీసీ, బీసీసీఐలకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ విషయాన్ని వదిలేయాలని, జట్టును ప్రపంచకప్ పైన దృష్టి సారించేలా చేయాలని బీసీసీఐ మీడియాకు హితవు పలికింది. I like challenging attacking players like Gayle: R Ashwin ఈ నేపథ్యంలో కోహ్లీ ఇష్యూ పైన అశ్విన్ స్పందించారు. అయితే, ఆ విషయమై కామెంట్ చేసేందుకు అతను నిరాకరించాడు. కోహ్లీ ఘటన తన పరిధిలో లేని అంశమని చెప్పాడు. మీడియా తమకు అండగా నిలబడాలని సూచించాడు. క్రికెట్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. గేమ్ ముందుకు వెళ్లాలంటే మీడియా మద్దతు తమకు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. గేల్ వంటి వారిని ఎదుర్కోవడం సవాల్‌గా భావిస్తా క్రిస్ గేల్ వంటి వారిని ఎదుర్కోవడం తాను సవాల్‌గా భావిస్తానని అశ్విన్ చెప్పాడు. గేల్, డివిల్లియర్స్ మాత్రమే కాదని, అలా ఎవరు దూకుడుగా ఆడినా అంతే అన్నాడు. తాను వికెట్ తీసేందుకు ఇష్టపడతానని, డేంజరెస్ బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ వికెట్ తీయడానికి ఇష్టపడతానని చెప్పాడు.