కోహ్లీ సేనకు వైట్‌ వాష్‌ తప్పదు

– టెస్టుల్లో నెంబర్‌వన్‌ ర్యాంకును కైవసం చేసుకుంటాం
– సఫారీ ఆటగాడు ఫిలాండర్‌
జొహనెస్‌బర్గ్‌, జనవరి23(జ‌నంసాక్షి) : ఆతిథ్య దక్షిణాఫ్రికా చేతిలో కోహ్లీ సేనకు వైట్‌ వాష్‌ తప్పదని, తిరిగి టెస్టుల్లో నంబర్‌వన్‌ ర్యాంకును కైవసం చేసుకుంటామని సఫారీ ఆటగాడు ఫిలాండర్‌ అన్నారు. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య బుధవారం చివరి టెస్టు జొహనెస్‌బర్గ్‌లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఫిలాండర్‌ మాట్లాడుతూ..’మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో దక్కించుకున్నాం. సిరీస్‌ దక్కింది కదా అని చివరి టెస్టును తక్కువ అంచనా ఏవిూ వేయలేమన్నారు.  అన్ని మ్యాచులాగానే ఇది ఉంటుందన్నారు. ఇందులో కూడా విజయం కోసం పోరాడుతామని తద్వారా టీమిండియాను వైట్‌ వాష్‌ చేస్తామని తెలిపారు. టెస్టు ర్యాంకింగ్స్‌లో తిరిగి నంబర్‌వన్‌ కావాలన్నదే మా లక్ష్యమని, ఇందుకోసం ప్రతి మ్యాచ్‌లో గెలవాలి’ అని ఫిలాండర్‌ పేర్కొన్నాడు. వాండరర్స్‌ మైదానం సెంచూరియన్‌ పిచ్‌కు పూర్తిగా విభిన్నమైనదని, ఈ పిచ్‌ బౌన్స్‌, పేస్‌కు అనుకూలిస్తోంది. పేస్లరకు బాగా కలిసివస్తుంది.  చివరి టెస్టులో స్పిన్నర్‌తో బరిలో దిగాలా వద్దా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొని బుధవారం టెస్టుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాం’ అని వివరించాడు. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 0-2తో కోల్పోయిన సంగతి తెలిసిందే. చివరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కోహ్లీ సేన కసరత్తులు చేస్తోంది.