క్యాష్ డిపాజిట్ మిషన్లు కూడా పనిచేయవు..!!

కేంcash-deposit-machineద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఇళ్లలో ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేయడం కూడా చాలా కష్టం అవుతోంది. బ్యాంకుల్లో పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండటంతో.. ఇన్నాళ్లూ ఎలాగోలా క్యాష్ డిపాజిట్ మిషన్ల (సీడీఎం) ద్వారా కొంతవరకు పని పూర్తి చేసుకునేవారు. కానీ, ఇప్పుడు అలా చేయడానికి కూడా కుదరదు. ఎందుకంటే, ఈ సీడీఎంలు దాదాపు ఆరు వారాల పాటు పనిచేయవని విశ్వసనీయ వర్గాల కథనం.  ఇప్పటికే కొత్త నోట్లు మార్కెట్లలోకి రావడంతో.. వాటిని కూడా సీడీఎంల ద్వారా డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇవి ఏటీఎంల లాంటివి కావు. ఏటీఎంలలో ఏ ర్యాక్‌లో పెడితే ఆ ర్యాక్‌ను బట్టి కాగితాలు లెక్కించి డబ్బు బయటకు పంపుతుంది. కానీ సీడీఎంలు అయితే నోటును పూర్తిగా ‘రీడ్’ చేస్తాయి. అందులో ఏవైనా నకిలీ నోట్లు ఉంటే ఆ విషయాన్ని కూడా స్కాన్ చేస్తాయి. ఇప్పుడు కొత్త నోట్లకు సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్లను మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సీడీఎంలలో ఫీడ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. సుమారు ఆరు వారాల వరకు ఈ మిషన్లు పని చేయకపోవచ్చని తెలుస్తోంది.