క్యూలైన్లో రైతు ఆకస్మిక మృతి

నిజామాబాద్‌: ఎరువులకోసం క్యూలైన్లో నిలబడిన ఓ రైతు ఆకస్మికంగా మృతి చెందిన దుర్ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. సదాశివనగర్‌ మండలం రామారెడ్డిలో రైతులు ఈ రోజు ఎరువులకోసం బారులు తీరారు. ఈసందర్భంగా వూసెయ్య అనే రైతు సొమ్ముసిల్లి పడిపోగా ఆసుపత్రికి తరలించారు. దారిలోనే అతను మృతి చెందాడు.