క్రిమిసంహారకా స్ప్రేతో దుష్ప్రభావాలే ఎక్కువ`

 

 

 

డబ్ల్యూహెచ్‌వో

జెనీవా,మే 17(జనంసాక్షి):ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ నిర్మూన చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందును పిచికారి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియతో మంచి కంటే ప్రమాదమే ఎక్కువని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో మనుషుపైనా పిచికారి చేస్తున్న విధానం అత్యంత ప్రమాదకరమని సూచించింది. వీటి ద్వారా కళ్లకు ప్రమాదం ఉండడంతోపాటు, శ్వాసకోస, చర్మ సంబంధ ఇబ్బందు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఫార్మాల్డిహైడ్‌, క్లోరిన్‌తోపాటు ఇతర రసాయనాను పిచికారి చేస్తున్నారు. వీధు, మార్కెట్‌ ప్రాంతాల్లో పిచికారి చేసినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. ఇలాంటి పద్ధతు వ్ల వైరస్‌ నిర్మూన జరగకపోగా.. మానవ ఆరోగ్యంపై ప్రతికూ ప్రభావం చూపిస్తాయని పేర్కొంది