*క్రిస్టల్ క్రాఫ్ కేర్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు*
మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): క్రిస్టల్ క్రాఫ్ కేర్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని కలకోవ స్టేజి సమీపంలో ఉన్న ఉడుం కృష్ణ మిల్లులో బుధవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టల్ క్రాఫ్ కేర్ ఆర్ బిఎం సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతులు అవగాహనతో మందులు పిచికారి చేసినట్లైతే అధిక దిగుబడులు పొందవచ్చని అన్నారు. పంటలపై వివిధ రకాల మందులను తగిన మోతాదులో పిచికారి చేసినట్లయితే అధిక దిగుబడి పొందవచ్చని తద్వారా రైతులు ఆర్థికంగా నష్టపోకుండ ఉండవచ్చని ఆయన అన్నారు. రైతులుప్లూటొన్ ను ఎకరానికి 300 గ్రాములు మాత్రమే వాడవచ్చని తెలిపారు. రైతు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ప్లూటోన్ ను యొక్క పిచికారిని హొలొకోన్ నాజిల్ ను ఉపయోగించవచ్చని, ఒక ఎకరానికి 150 నుంచి 200 లీటర్ల నీటికి మోతాదును ఉపయోగించవచ్చని, ఉత్తమ పరిమాణాల కోసం ఎల్లప్పుడు పిచికారి కోసం స్వచ్ఛమైన నీటిని ఉపయోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం ఎంబి భార్గవ్, యస్ పి ఎం వి శంకర్, డీలర్ చలసాని ప్రసాద్, రైతులు ఉప్పల యుగంధర్ రెడ్డి, ఉడుం కృష్ణ, దేవినేని వీరభద్రరావు, సాంబశివరావు, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, బిక్షం, మహేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.