క్రీడలతో పెద్దవారికీ ఉల్లాసమే..

న్యూయార్క్: క్రీడలతో పిల్లలు, యుక్తవయసు వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారనేది తెలిసిన విషయమే. అయితే క్రీడలు పెద్దవారికి, ముఖ్యంగా ఉద్యోగ విరమణ పొందిన వారికి కూడా మేలు చేస్తాయని అధ్యయనవేత్తలు తెలిపారు. రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నవారు ఏదో ఒక ఆటలో కాస్తంత ప్రావీణ్యం సంపాదిస్తే జీవితాన్ని ఆనందమయంగా గడపవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

హూస్టన్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. సాధారణంగా ఉద్యోగ జీవితంలో తీరిక లేకుండా గడిపిన వారికి విరమణ అనంతర జీవితం కొంత నిస్సారంగా అనిపించవచ్చు. ఈ సమయంలో వారు క్రీడలపై ఆసక్తి పెంచుకుంటే పిల్లల్లాగే ఉల్లాసంగా గడపవచ్చు. అమెరికాలో ఉద్యోగ విరమణ చేసిన అనేక మందిని అధ్యయనం చేసి పరిశోధకులు ఈ సూచనలు చేశారు.