క్రీడాకారులకు ఐటీడీఏ డీడీ అభినందన

ప్రశంసా పత్రాలు అందచేత

ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌-14 విభాగం 64వ జాతీయస్థాయి హాకీ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆదిలాబాద్‌ ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సుదర్శన్‌, ప్రదీప్‌లను ఐటీడీఏ డీడీ చందన అభినందనలు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, హాకీ శిక్షకుడు జె.రవీందర్‌, ప్రధానోపాధ్యాయుడు ప్రేమ్‌దాస్‌ ఉన్నారు. అలాగే చత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో జరుగుతున్న ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి అండర్‌-19 కార్ఫ్‌బాల్‌ పోటీల్లో తెలంగాణ జట్టు సెవిూస్‌కు చేరింది. గ్రూప్‌-బి నుంచి బరిలో నిలిచిన తెలంగాణ జట్టు ఇప్పటివరకు మూడు జట్లపై విజయాలు సాధించిందని జట్టు శిక్షకులు ఎన్‌.హరిచరణ్‌, యమునారావు, మేనేజర్లు అజయ్‌, వినోద్‌ తెలిపారు. చత్తీస్‌గఢ్‌ జట్టును 6-3 గోల్స్‌ తేడాతో ఓడించిన తెలంగాణ జట్టు, ఆ తర్వాత ఝార్ఖండ్‌ జట్టుపై 5-0 గోల్స్‌ తేడాతో గెలిచిందన్నారు. విద్యాభారతి జట్టుపైన 7-3 గోల్స్‌ తేడాతో విజయం సాధించి సెవిూస్‌లో ప్రవేశించిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ జట్టు విజయంలో ఆదిలాబాద్‌ జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారన్నారు.