క్రీడాకారులకు 25 కేజీల రైస్ బ్యాగ్ అందజేసిన నవీన్ రెడ్డి
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 10(జనం సాక్షి)
అండర్ 19 రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్న ఖొఖొ టీం క్రీడాకారులకు సోమవారం 25 కేజీల రైస్ బ్యాగ్ ను కొండ్రెడ్డి నవీన్ రెడ్డి అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ సభ్యుడైన కొండ్రెడ్డి నవీన్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్బంగా రంగశాయిపేట క్రీడా మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులకు తనవంతుగా రైస్ బ్యాగ్ అందజేశారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వారియర్స్ సభ్యులు ఎప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ముందు కూడా క్రీడాకారులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, మధు, మోహన్, కన్నయ్య, రాంబాబు, కరుణాకర్, రాంచందర్, వేణు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.