క్రీడాకారులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు
వరంగల్ ఈస్ట్,అక్టోబర్ 13(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రంగశాయిపేటలో 8వ తరగతి చదువుతున్న పనికల భవాని మరియు బుడిగ లిఖిత్ సాయి లు సెప్టెంబర్ 28 వ తారీఖు నుండి 30 వ తారీఖు వరకు మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లలో నిర్వహించిన 32వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖో-ఖో పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్ల తరపున పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలలో వరంగల్ జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానం సాధించడంలో భవాని తన వంతు పాత్ర వహించింది . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై. నర్సింహారెడ్డిపిఈటీగోగు నారాయణ విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.