క్రీడారంగాన్ని తాకట్టు పెట్టొద్దు

హైదరాబాద్‌, జనంసాక్షి: పవిత్రమైన క్రీడారంగాన్ని తాకట్టు పెట్టొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఐపీఎల్‌ లీగ్‌ను రద్దు చేసి క్రికెట్‌లో పాత వ్యవస్థనే ఉంచాలని ఆయన శుక్రవారమిక్కడ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు సమీపించినప్పుడే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని నారాయణ తెలిపారు.