క్రేన్ కింద పడి వ్యక్తి మృతి
ఖమ్యం గ్రామీణం: మండలంలోని నాయుడు పేటసమీపంలో బైపాస్ రోడ్డు దాటుతుండగా క్రేన్ కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై నాగరాజు తెలిసిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎం వెంకటాయ పాలేనికి చెందిన తుపాకుల వెంకన్న (26) కూలి పని కోసం ఈ రోజు ఉదయం నాయుడుపేట సమీపంలో రోడ్డు దాటుతూ అటునుంచి వస్తున్న క్రేన్ కింద పడి మృతి చెందాడు. బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నారు.