క్రోయేషియా వీరులకు రాజధానిలో ఘనస్వాగతం
ఓడినా గెలిచినంత పనిచేశారని అభినందనలు
జాగ్రెబ్,జూలై17(జనం సాక్షి): ప్రపంచకప్ ్గ/నైల్లో ఫ్రాన్స్ చేతిలో ఓడినా.. క్రొయేషియాకు అభిమానుల్లో ఏమాత్రం విలువ తగ్గలేదు. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్కు వచ్చిన తమ జట్టుకు ఆ దేశ అభిమానులు అపూర్వ రీతిలో స్వాగతం చెప్పారు. క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద దాదాపు లక్ష మంది అభిమానులు గుమిగూడి తమ జట్టుకు స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ బస్సులో వచ్చిన క్రొయేషియా జట్టు.. అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగింది. గో/-డలెన్ బాల్ విజేత, క్రొయేషియా కెప్టెన్ లుకా మోద్రిచ్తో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడ్డారు.