క్షమాపణలు చెప్పిన గుప్తా కుటుంబం

జొహన్నెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికాలోని సంపన్న భారతీయ కుటుంబంలో పెళ్లి సందర్భంగా తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ కుటుంబం శనివారం ఆఫ్రికా, భారత్‌ రెండు దేశాలకూ క్షమాపణలు చెప్పింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్‌ జుమాతో సన్నిహిత సంబంధాలు కలిగిన గుప్తా కుటుంబం కుమారుడి పెళ్లి సందర్భంగా అతిధులను తరలించడానికి ఉపయోగించిన చార్టర్డ్‌ విమానాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా మిలిటరీ ఎయిర్‌బేస్‌లో దించడం పలు వివాదాలకు తెరలేపింది. ఈ వివాదంలో ఇప్పటికే ఓ దౌత్యవేత్తతో సహా పలువురు పోలీసు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. పలువురు మంత్రులు, దౌత్య అధికారులు ఈ అంశంలో విమర్శలు ఎదుర్కొనవలసి వచ్చింది.