క్షయ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత
హుజూర్ నగర్ సెప్టెంబర్ 5 (జనం సాక్షి): క్షయ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో, హుజూర్ నగర్ మల్లన్న నగర్ నందు క్షయ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, రాత్రి వేళల్లో జ్వరము , బరువు తగ్గడం, తెమడలో రక్త జీ రలు కనపడినట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు నిర్వహించుకున్నట్లయితే వారికి ఉచిత మందులు అందించడంతోపాటు పోషకాహార నిమిత్తం ప్రతినెల ప్రభుత్వము 500 రూపాయలను నేరుగా చికిత్స పూర్తయ్యే వరకు రోగి ఎకౌంట్లో వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 2వార్డ్ కౌన్సిలర్ జక్కుల శంభయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ ప్రభాకర్, పి హెచ్ ఎన్ నూర్జహాన్ బేగం, టిబి నోడల్ పర్సన్ ఇందిరాల రామకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్ గూడెపు రమేష్, ఉదయగిరి శ్రీనివాస్, ఆర్ మాదవి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.