ఖండాంతరాల అవతల తెలంగాణ వాదం
మనషులక్కడ.. మనసులిక్కడ.. తెలంగాణ నెటిజన్స్ ఫోరం
అమెరికా :ఖండాంతరాల అవతల తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నారు వాళ్లు..తమ లక్ష్యం, తమ ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని ప్రకటించి దాని కోసం తమ శాయశక్తులా పోరాడుతున్నారు..ఎక్కడో దేశదేశాల అవతల ఉంటూ అక్కడ సైతం తెలంగాణా నినాదాన్ని వినిపిస్తున్న తెలంగాణ నెటిజన్ పోరం ఏర్పడి సంవత్సరం గడిచింది..ఈ సంవత్సర కాలంలోనూ ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ ఏర్పాటుపై పోరు చేసింది..అంతవరకూ ఇంటర్‌నెట్‌లో ఉన్న కుటిల ఆంధ్ర ఆధిపత్య ధోరణికి చరమగీతం పాడుతూ తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను ఇంటర్‌నెట్ వేదికగా ప్రపంచానికి చాటింది..తెలంగాణ వ్యతిరేకంగా జరుగుతన్న కుట్రలను ఎండగట్టేందుకు ఒక ఫోరం ఎర్పడి సకలజనుల సమ్మెతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది..తెలంగాణ నెటిజన్ ఫోరం..తెలంగాణ ఉద్యమ కెరటం కొండా లక్ష్మణ్ బాపూజి ఢిల్లీలో దీక్ష చేస్తే సంఘీభావం ప్రకటించిన వారు సెప్టెంబర్ 17న తెలంగాణ విద్రోహ దినాన్ని జరిపారు. టెన్ కె రన్‌లో పాల్గొని తెలంగాణ ఉద్యమాన్ని ఉరికించిండ్రు..తెలంగాణ కోసం ఏం చెయ్యాల్నో టీడీఎఫ్‌తో కలిసి చర్చించారు..విద్రోహ దినం ర్యాలీలో పాల్గొని తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటిండు..తెలంగాణ పోరు చిత్రాలైన పోరు తెలంగాణ, జైబోలో తెలంగాణను ఆదరించి అక్కున చేర్చుకున్నరు…బీజేపీ పోరు యాత్రలో హోరు చూపి, యాదయ్యను యాది చేసుకుంట రక్తదానం చేసిండ్రు..తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణవాదానికి విజయం కట్టబెట్టడంలో తమ వంతు పాత్ర పోషించిండ్రు..భోజ్యానాయక్ అంతిమ యాత్రలో పాల్గొని చలించిపోయిన ఫోరం సభ్యులు జేఏసీతో కలిసి ఆత్మహత్యల నివారణకు కార్యక్రమాలు చేసిండ్రు..సెప్టెంబర్ మార్చ్‌లో చేయీచేయీ కలిపిండ్రు…సాగరతీరంలో మానహారం అయిండ్రు..తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోవడం మాత్రమే కాదు బొక్కలు వంగి జీవితం దుర్భరంగా మారిన ఫ్లోరోసిస్ బాధితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు తమ వంతు కార్యక్రమాలు చేస్తున్నరు..గగన వినీలాకాశాన తెలంగాణ ఉద్యమాన్ని, నినాదాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్న తెలంగాణ నెటిజన్ ఫోరం ఇదే విధంగా భవిష్యత్తులోనూ తెలంగాణ వచ్చే వరకూ తమ ఉద్యమ బాటను వీడమని స్పష్టం చేస్తోంది.