ఖమ్మంలో ఎదురుకాల్పులు
ఖమ్మం : చర్ల మండలం చెన్నాపురం గుట్ట వద్ద పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం మావోయిస్టులు సమీపంలోని అడవిలోకి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో కిట్‌బ్యాగ్, విప్లవసాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.