ఖమ్మంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఖమ్మం, జనవరి 19 : ఖమ్మం పట్టణంలోని శీలం సిద్ధారెడ్డి కళాశాలలో డిగ్రీ 1074-77 విద్యా సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులు వెంకటనారాయణ, సత్యనారాయణ, విశ్వేశ్వరరావు శనివారంనాడు విలేకరులకు తెలిపారు. ఖమ్మం పట్టణంలోని హర్ష హోటల్‌లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే ఈ సమ్మేళనానికి విద్యార్థులు అధిక సంఖ్యలో తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.