ఖమ్మంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

ఖమ్మం: స్ధాయి  విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను  మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గురువారం ప్రారంభించారు. పాలేరు నవోదయ పాఠశాలలో ప్రారంభమైన ఈ విద్యా వైజ్ఞానికి ప్రదర్శనలు నేటి నుంచి మూడు రోజులపాటు జరుగుతాయి. పరిశ్రమలు, సహజ వనరులు- వినియోగం, రవాణా-రవాణా సౌకర్యాలు , సమాచారం- సాంకేతి విద్య. పరిసరాలు – ఆరోగ్యవంతమైన సమాజం, గణితశాస్త్రం అంశాలపై విద్యార్థులు ప్రదర్శనలో తమ ప్రతిభను చాటుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శనలో పాల్గోని తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. చదువుతోపాటు విద్యార్థల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు  ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.