ఖమ్మంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని తనికెళ్లలో లక్ష్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్ ప్రాధమిక విద్యాశాఖమంత్రి ఎస్ శైలజానాధ్ ప్రారంభించారు. వీరితో పాటు ఉప సభావతి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి, ఎమ్మెల్సీ కోట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో 12 జిల్లాలనుంచి 382 ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులో దాగి ఉన్న సృజనాత్మకతకు శాస్త్రసాంకేతిక విజ్ఞానాన్ని జోడించి నూతన ఆవిష్కరణలు చేసేందుకే ఇన్‌స్పైర్ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి అధ్యక్షత వహించగా ఉప సభావతి మల్లు భట్టి విక్రమార్క్, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వైరా స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ బానోత్ చంద్రావతి, ఎన్సీఆర్టీ డైరెక్టరు సత్యనారాయణ రెడ్డి, వరంగల్ ఆర్జేడీ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 12 జిల్లాల నుంచి 381 సమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. 3 రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు.