ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు
మ్మం, ఆగస్టు 16: జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాజేడు మండలం గుమ్మడిదొడ్డి వద్ద చీకుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం దాటికి గ్రామాలు జలమయమ్యాయి. దాదాపు 25 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో గోదావరి నది నీటిమట్టం 35 అడుగులకు చేరుకుంది.