ఖమ్మం జిల్లాలో స్పీకర్ పర్యటన ప్రారంభం
ఖమ్మం పట్టణం: అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసనసభ ఎస్టీ కమిటీ సభ్యులు ఖమ్మం నుంచి కొత్తగూడెం, మణుగూరుల్లో పర్యటించనున్నారు. ఆదివారం
రాత్రి ఖమ్మంలోని ఆర్ అండ్‌బి అతిధిగృహంలో బస చేసిన స్పీకరు బృందంతో సోమవారం ఉదయం మంత్రి వెంకటరెడ్డి, ఉప సభాపతి భట్టి విక్రమార్క, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు సమావేశమయ్యారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కలెక్టరు సిద్ధార్థజైన్ వివరించారు. స్పీకర్ మనోహర్ వివిధ వర్గాల ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు.
వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న స్పీకర్ ఎస్టీ కమిటీ సభ్యులతో కలిసి బస్సులో కొత్త గూడెంవ వెళ్లారు. సింగరేణి బొగ్గు గనుల విస్తరణను అక్కడ పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను సింగరేణి అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం మణుగూరు వెళ్లి అక్కడ ఉపరితల బొగ్గుగనులను పరిశీలిస్తారు. ఈరోజు రాత్రి మణుగూరు మండలం రాయగూడెం గ్రామంలో బసచేసి గిరిజనులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. రేపు భద్రాచలం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.