ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజారోగ్య ప్రయోగశాల
ఖమ్మం, జనవరి 28 (): వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజా ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. అత్యంత అధునాతనమైన పరికరాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాధి నిర్దారణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందని వారు తెలిపారు. సంబంధిత పరికరాల కొనుగోలుకు 19 లక్షలు విడుదలయ్యాయని అధికారులు తెలిపారు. తద్వారా కీటకజనిత, నీటిజనిత వంటి వ్యాధుల నిర్దారణ పరీక్షలు కూడా ఇక్కడే జరిపే అవకాశం ఉంటుందని వారు తెలిపారు.