ఖమ్మం: మంత్రి ‘పోచారం’ను కలిసిన మల్లిబాబుయాదవ్
కామేపల్లి: జిల్లాలో గొర్రెల,మేకల పెంపకందార్లు సమస్యలు పరిష్కారించాలని కోరు తూ పశుసంవర్థకశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ను జిల్లా గొర్రెల, మేకల సహకార యూనియన్ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లిబాబుయాదవ్ శుక్రవారం హైద్రాబాద్‌లో కలిశారు. ఈసందర్భంగా మంత్రి పోచారం కు జిల్లా గొర్రెల,మేకల పెంపకందార్లకు ప్రత్యేక భవనం నిర్మించాలని, గొర్రలను,మేకలను అమ్మకాలు,కోనుగోలు చేసేందుకు మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.