ఖమ్మం: మహిళ ఆత్మహత్యాయత్నం
ఎర్రుపాలెం : మండలంలోని పెద్దగోపవరం గ్రామానికి చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసునమోదైంది. ఎస్సై గౌతమ్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెద్దగోపవరం గ్రామానికి చెందిన వెదురు విజయలక్ష్మి భర్త మృతి చెందడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆర్థిక సమస్యల కారణంగా ఆమె ఈ నెల 12వ తేదీన ఉదయం ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి సోదరుడు లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.