ఖరారు కాని బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్,ఫిబ్రవరి12(జనంసాక్షి): ఎపి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ సమర్పించారు. అయితే తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఫిబ్రవరి మాసాంతంలో సమావేవాలు నిర్వహించచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ నిబంధనల ప్రకారం బడ్జెట్ సమావేశాలను కనీసం 16 పనిదినాలపాటు విధిగా నిర్వహించాలి. అయితే సమావేశాల ప్రారంభ తేదీపై అసెంబ్లీ సచివాలయానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు అందలేదని తెలుస్తోంది. అంతేగాకుండా కేంద్ర బడ్జెట్ తీరుతెన్నులు చూశాక రాష్ట్ర బడ్జెట్‌పై కసరత్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నెలాఖరులో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.