‘ఖాకీ’ల కొలువుల జాతర
– త్వరలో 18వేల ఖాళీల భర్తీ
– ఓటుకు నోటు కేసులో చట్టబద్ధంగావ్యవహరిస్తాం
– డీజీపీ అనురాగ్ శర్మ
వరంగల్,జూన్22(జనంసాక్షి):
పోలీసుశాఖలో త్వరలో 18వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు,రాష్ట్రానికి కొత్తగా మూడు బెటాలియన్లు మంజూరయ్యాయని వాటిలో ఒకటి వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ వెల్లడించారు.ఇటీవల నూతనంగా ఏర్పడిన పోలీస్ కమిషనరేట్‌ను పరిశీలించేందుకు డీజీపీ సోమవారం వరంగల్‌కు వచ్చారు. కమిషనరేట్‌లో నూతనంగా కేటాయించిన పోలీస్ వాహనాలను ఆయన ప్రారంభించారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిబ్బందిని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో చట్టప్రకారమే పోతున్నామని డీజీపీ అన్నారు. ఈ కేసును ఏసీబీ చూసుకుంటుందని తెలిపారు. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలో ఉందని… ఆ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. హైదరాబాద్‌లో అధికారాలు తెలంగాణ పోలీసుల అదుపులోనే ఉంటాయని స్పష్టం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు దీటుగా వరంగల్ పోలీసు కమిషనరేట్‌ను తీర్చిదిద్దుతామన్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో కొత్తగా ఐదు పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని… కమిషనరేట్ భవనానికి రూ.5.50 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు డీజీపీ తెలిపారు. వరంగల్ నగరానికి మరో బెటాలియన్ మంజూరైందని పేర్కొన్నారు. వరంగల్‌లో నూతన కమిషనరేట్‌ను అత్యంత అధునాతనంగా నిర్మిస్తామని వెల్లడించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ భవనం కోసం రూ.5.50 కోట్లు కేటాయించామని వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌లకు దీటుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌ను తీర్చిదిద్దుతామని డీజీపీర్మ అన్నారు. హైదరాబాద్‌లో అధికారాలు తెలంగాణ పోలీసుల అదుపులోనే ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కొత్తగా మూడు బెటాలియన్లు మంజూరయ్యాయని వాటిలో ఒకటి వరంగల్ నగరంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదిలావుంటే ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్యకు ఏపీలో ఆశ్రయం కల్పించడం నేరమేనని న్యాయ నిపుణులు అంటున్నారు. కేసులో వాంగ్మూలం ఇవ్వకుండా తప్పించుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అనారోగ్య కారణాలపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. విచారణకు హాజరుకాకపోతే ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణ ఊపందుకుంది. ఈమేరకు విచారణను వేగవంతం చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ టేపుల గుట్టు విప్పుతోంది. అయితే ఈ కేసులో రికార్డయిన వాయిస్ చంద్రబాబుదేనని, సంభాషణలో ఎక్కడా కట్, పేస్టులు లేవని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నివేదిక సమర్పించనుంది.