ఖానాపూర్‌కు మంత్రి వరాలు

-2వేల దీపం కనెక్షన్లు మంజురు
-సదర్‌మాబ్‌ బ్యారేజ్‌ నిర్మానానికి హామీ
ఖానాపూర్‌ : ఖానాపూర్‌ పట్టాణానికి గురువారం రాత్రి వచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వరాలు కురిపించారు. 1970 దశకంలో శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాద రావ్‌ ఖానాపూర్‌ గ్రామ పంచాయితీ కార్యనిర్వహణ అధికారిగా పని చేసిన రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. స్థానికులను పలకరించారు.
తండ్రితో ఖానాపూర్‌కు ఉన్నా అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. పట్టాణ ప్రజలకు 2 వేల దీపం కనెక్షన్లను మంజురు చేస్తున్నట్లు ప్రకటించారు. ఖానాపూర్‌, కడెం మండలాల రైతంగానికి జీవనాధారమైన సదర్‌మాట్‌ ఆధునికరణ పనులకు నధులు మంజూరు చేస్తున్నాట్లు తెలిపారు. త్వరలోనే బ్యారేజ్‌ పనులు జరిగేందుకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. కడెం ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు.
ఉగాదిన ప్రారంభమైన అమ్మహస్తం పథకం కొన్ని సాంకేతిక కారణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. వాస్తవమేనని, సరకుల కోసం డీలర్లు సకాలంలో డీడీలు కట్టినందున పూర్తి స్థాయిలో విడుదల కాలేదన్నారు. వచ్చే నెల నుంచి బియ్యంతో సహా9 రకాల వస్తువులను పూర్తి నాణ్యతతో సరఫర చేస్తామని చెప్పారు. బ్యాగు మాత్రం ఒకేసారి ఇస్తామన్నారు. రాష్ట్రంలో 2కోట్ల 25లక్షల తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయని, నేడు ఏడున్నార కోట్ల ప్రజలు అమ్మహస్తం పథకంలో లబ్దిపొందునున్నారని మంత్రి అన్నారు. బోగస్‌ కార్డుల పేర్లతో గతంలో రద్దు చేసిన వాటిలో సరైనా అర్హులను గుర్తించి త్వరలోనే వారికి రేషన్‌కార్డులు అందజేస్తామన్నారు. డీలర్ల కమీషన్‌, వారి సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తామని తెలిపారు.
మంత్రికి కాంగ్రెస్‌ నాయకుల కృతజ్ఞతలు
సదర్‌మాట్‌ బ్యారెజ్‌ నిర్మాణానికి నిధుల మంజురు, కడెం ప్రాజెక్టు ఎత్తుపెంపు, ఖానాపూర్‌ పట్టాణప్రజలకు 2వేల గ్యాస్‌ సిలెండర్లు మంజూరు పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీపీఎస్పీ సభ్యుడు రవీందర్‌ రావ్‌, స్థానిక కాంగ్రెస్‌ నాయకులు సురేష్‌కుమార్‌, కె. గంగారావ్‌, రాజన్న , రాజేశ్వర్‌ చ, రమేశ్‌, సయ్యద్‌ ఇసాక్‌, సుధకర్‌రావ్‌, భీమయ్య, తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.