ఖాయిలా పడిన కర్మాగారాల పునరుద్ధరణకు నిర్ణయం: ఎంపీ వివేక్
గోదావరిఖని, జనంసాక్షి: దేశంలో ఖాయిలా పడిన ఎరువుల కర్మాగారాలను పునరుద్దరించేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పెద్దపల్లి ఎంపీ వివేక్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని రామగుండం ఎరువుల కరామగారాలను మెదటి విడతగా పునరుద్దరించనున్నట్లు ఆయన తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి సంబంధించి రూ.10,400 కోట్లు రుణమాఫీ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే బిఐఎఫ్‌ఆర్ సమాశేశంలో ఎరువుల కర్మాగారం పునరుద్ధరణపై అధికారిక ప్రకటన వస్తుందన్నారు. ఇంజినీర్స్ ఇండియా, నేషనల్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం స్థితిగతులపై జూలై చివరి వారంలో కమిటీ పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కర్మాగారం పునరుద్దరణతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు.