ఖేర్స‌న్ ప‌ట్ట‌ణాన్ని ర‌ష్యా బ‌ల‌గాలు ఆధీనంలోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది

కీవ్‌: ర‌ష్యా సేన‌లు దూసుకువెళ్తున్నాయి. ఉక్రెయిన్‌లోని ఒక్కొక్క న‌గరాన్ని చేజిక్కించుకుంటున్నాయి. తాజాగా ఖేర్స‌న్ ప‌ట్ట‌ణాన్ని ర‌ష్యా బ‌ల‌గాలు ఆధీనంలోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ద‌క్షిణ ప్రాంత న‌గ‌ర‌మైన ఖేర్స‌న్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రిత్వ కార్యాల‌యం పేర్కొన్న‌ది. ఒక‌వేళ ఖేర్స‌న్ న‌గ‌రం ర‌ష్యా చేతుల్లోకి వెళ్తే, అప్పుడు ఆ దేశం స్వాధీనం చేసుకున్న అతిపెద్ద ఉక్రెయిన్ న‌గ‌రం ఇదే అవుతుంది. నిన్న రాత్రి ఆ న‌గ‌ర వీధుల్లో ఉన్న ర‌ష్యా బ‌ల‌గాలు.. ఖేర్స‌న్ రైల్వే స్టేష‌న్‌ను, పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రో వైపు ఖార్కివ్ న‌గ‌రంపై ర‌ష్యా దాడులు కొన‌సాగిస్తూనే ఉన్న‌ది. తాజాగా ఖార్కివ్ పోలీసు బిల్డింగ్‌పై మిస్సైల్ అటాక్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. సిటీలో ఉన్న పోలీసు డిపార్ట్‌మెంట్ బిల్డింగ్‌ను క్షిప‌ణితో పేల్చేసిన‌ట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. పోలీసు బిల్డింగ్ పూర్తిగా మంట‌ల్లో ద‌గ్ద‌మైన‌ట్లు ఓ వీడియో రిలీజైంది. క‌రాజిన్ నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీలో ఉన్న ఓ బిల్డింగ్ కూడా ధ్వంస‌మైన‌ట్లు ఆ దేశ కేంద్ర హోంశాఖ వెల్ల‌డించింది.