గంగవరం విద్యుత్ ఉపకేంద్రం ముట్టడి
ఖమ్మం : విద్యుత్ కోతలకు నిరసనగా ఖమ్మం జిల్లాలోని గంగవరం విద్యుత్ ఉపకేంద్రాన్ని నాలుగు గ్రామాల రైతులు ముట్టడించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులను నిర్భంధించి కార్యాలయానికి తాళం వేశారు. దీంతో ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని రైతులతో చర్చలు చేపట్టారు.