గంగా తలావో సందర్శించిన మోడీ
పోర్ట్ లూయిస్: మారిషస్ పర్యటనలో ఉన్న ప్రదాని మోడీ గంగా తలావో సందర్శించారు. బుధవారం సాయంత్రం పోర్ట్ లూయిస్ చేరుకున్న మోడీ ఆ దేశ అధ్యక్షుడు, ప్రదానులను కలుసుకున్న తర్వాత ఉదయం ఈ శివాలయానికి చేరుకున్నారు. అక్కడ పూజలు నిర్వహించారు. మారిషస్ నడి బొడ్డులోని ఓ పర్వత ప్రాంతంలో గల ఈ ఆలయం హిందువుల ముఖ్యమైన ఆరాధ్య కేంద్రంగా వెలుగొందుతుంది. దీనికి ఆనుకొని ఓ పెద్ద బిలంలో ఏర్పడిన సరస్సు ఉంది. శివరాత్రి సందర్భంగా హిందువులు కాలినడకన ఈ దేవాలయానికి చేరుకుంటారు.