గంటా ఏం మాట్లాడుతున్నావ్?
– హైదరాబాద్ తెలంగాణ గడ్డ
– సెక్షన్ 8పై ఆంధ్రా నాయకులకు అవగాహణ లేదు
– మంత్రి కడియం శ్రీహరి
హైదరాబాద్,జూన్27(జనంసాక్షి): సెక్షన్-8పై ఆంధప్రదేశ్ నాయ కులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాం తం చేయాలన్న ఊహల్లో ఏపీ నేతలు ఉన్నారని పేర్కొన్నారు. వారి తీరు తె లంగాణను అవమాన పరిచేలా ఉందన్నారు. హైదరాబాద్ తెలంగాణ ప్రజల ఆస్తి అంటూ, హైదరాబాద్‌పై మాట్లాడే నైతికత తెలంగాణ ప్రజలకే ఉందని తేల్చి చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యామండలిలో ఏపీ సమాచారాన్ని పూర్తిగా అందజేశామని అన్నారు. అయితే దీనిపై ఎపి మంత్రి గంటా శ్రీనివాసరావు చేస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించారు. గంటా ఏం మాట్లాడుతున్నారో తెలియదన్నారు. గవర్నర్ వద్ద భేటీ తరవాత తాను గంటాకు అన్ని విధాల సహకరిస్తామని చెప్పానని, అయితే ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు తనకు ఇవ్వలేదన్నారు. అవినీతి కేసులు తప్పించుకునేందుకు చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు.మా ఫోన్లను ట్యాప్ చేశారంటున్న ఆంధ్రా నేతలు సాక్ష్యాలను ఎందుకు బయటపెట్టడం లేదని ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. హైదరాబాద్‌పై మాట్లాడే నైతిక హక్కు ఆంధ్రా నేతలకు
లేదన్నారు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అని అన్నారు. విభజనచట్టంలోని ఏ అంశాన్ని ఉల్లంఘించామో ఆంధ్రా ప్రాంత నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. సెక్షన్-8 గురించి ఆంధ్రా నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు వ్యవహారాన్ని రెండు ప్రాంతాల ప్రజల సమస్యగా చిత్రీకరించాలని చూస్తున్నారు. చంద్రబాబు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఆంధ్రా నేతలు అనవసర డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రు. చంద్రబాబు ఓట్లకు నోటు కేసులో పట్టపగలు దొరికిన దొంగ అని ఆయన ద్వజమెత్తారు. దొరికిపోయిన దొంగలకు నీతులు చెప్పే హక్కు ఉండదని కూడా ఆయన అంటున్నారు. చంద్రబాబు ,ఆయన మంత్రులు వంటివారు దొరకడం ఎపి ప్రజలు చేసుకున్న ఖర్మ అని కూడా ఆయన ఘాటుగా అన్నారు.సెక్షన్ ఎనిమిదిపై ఎపి మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. శనివారం నాడిక్కడ సెట్ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. మొత్తం 1,02,388 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా 6,432 మంది క్వాలిఫై అయ్యారు. తెలంగాణలో 3,540 మంది, ఆంధప్రదేశ్‌లో 2,892 మంది విద్యార్థులు క్వాల్గి/ అయ్యారని మంత్రి తెలిపారు. త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని, వీసీల నియామకాలు చేపడతామని ప్రకటించారు.