గందరగోళంగా ఉభయ సభలు

పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభలో కురియన్ అధ్యక్ష స్థానాలలో ఉన్నారు. ప్రారంభం నుంచీ ఈ రోజు కూడా ఉభయ సభలలోనూ గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు తమ నిరసనను కొనసాగిస్తున్నాయి. ప్రధాని నరేంద్రrajya-sabha759 మోడీ సభకు రావాల్సిందేననీ, వచ్చి క్షమాపణ చెప్పాల్సిందేనని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించడమంటే నల్లధనాన్ని సమర్ధించడమేనని మోడీ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో సభకు సమాధానం చెప్పకుండా ప్రధాని నరేంద్ర మోడీ ముఖం చాటేస్తున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. పెద్ద నోట్ల రద్దులో రాజకీయం లేకుంటే ఆయన సభకు వచ్చి విషయం వివరించ వచ్చుకదా అని రాజ్యసభలో అన్నారు. విపక్షాల ఆందోళనల మధ్యే మాట్లాడిన మాయావతి ప్రధాని మోడీ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.