గజల్ గాయకుడు విఠల్‌రావు మృతి
– సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్, 26 జూన్ (జనంసాక్షి):
ప్రముఖ గజల్ గాయకుడు విఠల్‌రావు మృతి చెందారు. పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. విఠల్‌రావు కుటుంబసభ్యులకు, శిష్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పదవ నిజాం ఆస్థానంలో గజల్ విద్వాంసుడిగా విఠల్‌రావు పని చేశారు. దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉన్న కళాకారుడిగా విఠల్‌రావు ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విఠల్‌రావును ప్రత్యేకంగా గుర్తించి పారితోషకాన్ని ప్రకటించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రముఖ పర్యావరణవేత్త, మాజీ ఐఏఎస్ రాజమణి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.