గజ్వేల్‌ను ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాం

5

– సొంత నియోజక వర్గంలో కేసీఆర్‌ పర్యటన

మెదక్‌,మే 9(జనంసాక్షి): గజ్వెల్‌ను స్మార్ట్‌ సిటీగా అభివృద్ది చేసి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతానని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడే తాము నివసించాలని ఇతర ప్రాంతాల వారు అనుకునే విధంగా చేస్తానని అన్నారు.  తన స్వంత నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటించిన సిఎం అనేక అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. షాదీఖానా, ఆడిటోరిం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దీనివల్ల ఇక్కడ సభలు, సమావేవాలుతో పాటు పెళ్లిళ్లు కూడా చేసుకునేలా అద్భుతంగా నిర్మిస్తామని అన్నారు. గజ్వేల్‌ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. గజ్వేల్‌ను అన్ని హంగులతో అద్బుతమైన అందమైన పట్టణంగా తీర్చి దిద్దుతామని హావిూ ఇచ్చారు. గజ్వేల్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు రావాల్సి ఉందన్నారు. పాండవుల చెరువు పునరుద్దరణ పనులను ఇవాళ ప్రారంభించామని తెలిపారు. దీనిని ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.  ఇది ఆరంభం మాత్రమేనని గజ్వేల్‌ను ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రెండు మూడేళ్లలో గజ్వేల్‌ పట్టణాన్ని గజ్వేల్‌లో నివసించాలని అనిపించేలా అభివృద్ధి చేస్తామన్నారు. రు. ఇది ఆరంభం మాత్రమేనని గజ్వేల్‌ను ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రెండు మూడేళ్లలో గజ్వేల్‌ ఎక్కడా లేని అభివృద్దితో ముందుకు తసీఉకుని పోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం వెంట డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, మంత్రి హరీష్‌ రావు తదితరులు పాల్గొన్నారు.