గడువులోపు తెలంగాణ : హోంమంత్రి షిండే
న్యూఢిల్లీ : ఇచ్చిన గడువులోపు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. ఇవాళ ఆయన శాఖకు సంబంధించిన నెలవారి సమీక్షలో భాగంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అఖిలపక్ష సమావేశంలోనే చెప్పామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై సంప్రతింపులు జరుపుతున్నామని అయితే తెలంగాణపై నిర్ణయం ఏమిటో ఇప్పుడే చెప్పనని షిండే పేర్కొన్నారు. తెలంగాణపై ఏం చేయాలో, ఏం చేయకూడదో చాలా మంది సూచనలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.