గణతంత్రానికి జిల్లా కేంద్రాలు సిద్దం
హైదరాబాద్,జనవరి25(జనంసాక్షి): జిల్లాలు ఏర్పడ్డ తరవాత వరుసగా రెండో గణతంత్ర వేడుకలకు జిల్లాలు సిద్దం అయ్యాయి. జిల్లా/-లోలో తొలి గణతంత్ర వేడుకకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కలెక్టర్లు ఆయా జిల్లాల కేంద్రాల్లో జెండా ఆవిష్కరణ చేస్తారు. ఎక్కడిక్కడ జాతీయ పతాకం ఆవిష్కరణ, పరేడ్, వేదిక ఏర్పాటు పూర్తయ్యింది. జిల్లాల ఆవిర్భవించాక ఈ వేడుకలకు ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ఏర్పాట్లు పక్కాగా చేపట్టారు. పరేడ్ ట్రయల్ నిర్వహించడం, మైదానం సిద్ధం చేయించడం వంటి ముఖ్య అంశాలను పూర్తి చేశారు. స్టాళ్ల ఏర్పాటు పక్రియను జిల్లా గ్రావిూణాభివృద్ధి అధికారి పర్యవేక్షించారు. ఉత్తమ స్టాళ్లకు బహుమతి కూడా అందించాలని నిర్ణయించారు. వ్యవసాయ, ఉద్యాన, అటవీ, జిల్లా గ్రావిూణాభివృద్ధి, వైద్యారోగ్య శాఖ, మెప్మా, స్త్రీ, శిశు సంక్షేమం, నీటి పారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు కీలక ప్రభుత్వ పథకాలను శకటాల రూపంలో కళ్లకు కట్టేలా ప్రదర్శించనున్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసారు. సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రజలు కూడా ఈ ఉత్సవాలకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.